పదేళ్ళతర్వాత మరోసారి నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం అయింది. బీజేపీ ప్రాబల్యం బలంగా ఉన్నా సరే ప్రతికూల పరిస్థితులను అధిగమించి మేయర్ స్థానం దక్కించుకుంది. 28డివిజన్ లలో గెలిచి కార్పొరేషన్ లో అతి పెద్ద పార్టీ గా అవతరించిన బీజేపీ వోట్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ని దాటలేక పోయింది.
ఆపార్టీ దాదాపు మూడు వేల వోట్లు బీజేపీ కన్న అధికంగా సాధించడం గమనార్హం. కానీ డివిజన్ ల విషయంలో బీజేపీ 28 స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ 17 స్థానాలకు పరిమితం అయింది.మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆపార్టీ 60 డివిజన్ లలో పోటీ చేసింది మేయర్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న సరే ఎన్నికల్లో మాత్రం మైనార్టీ ఏరియాల్లో కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించింది.
కానీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంది యంఐయం అభ్యర్థుల ఓడిపోవాలనే వ్యూహం తో పనిచేయలేదు. అయినప్పటికి మైనార్టీ ఏరియా ల్లో నాలుగు స్థానాలు గెలిచింది.
మొత్తంగా 62623 వోట్లు పోలు కాగా బీజేపీ కి 59456 వోట్లు పోలు అయ్యాయి. గత అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో కన్న ఎక్కువగా కాంగ్రెస్ కు వోట్లు పోలు కావడం విశేషం. కార్పొరేషన్ ఎన్నికలో బీజేపీ గెలిచిన డివిజన్ లలో భారీ ఆధిక్యం తో గెలిచాయి.14 స్థానాలు గెలిచిన యంఐయం కూడా 32 817 వోట్లు సాధించింది. బిఆర్ యస్ ఈసారి భారీగా వోట్లు కోల్పోయింది.
కేవలం 15302 వోట్లు కు పరిమితం అయింది. దాదాపు కాంగ్రెస్ 34.35 శాతం బీజేపీ కి 32.41 శాతం బిఆర్ యస్ కు 8.87 శాతం వోట్లు పోలు అయ్యాయి. మెజార్టీ స్థానాలతో అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ కాంగ్రెస్ కన్న రెండు శాతం వోట్లతో వెనుక బడింది.
2020 ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలు గెలిచిన బీజేపీ 47 శాతం వోట్లు సాధించింది యంఐయం కూడా ఏకంగా 27 శాతం బిఆర్ యస్ 22 శాతం కాంగ్రెస్ రెండు స్థానాలు గెలిచి రెండు శాతం మేరకే వోట్లు సాధించింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ బిఆర్ యస్ యంఐయం పార్టీ లు వోట్లు కోల్పోతే ఒక్క కాంగ్రెస్ పార్టీమాత్రం భారీగా వోట్లు సాధించడం గమనార్హం.
గత ఎన్నికలో రెండే స్థానాలకు పరిమితం అయినా కాంగ్రెస్ ఈసారి 17 స్థానాలు దక్కించుకుంది. టీడీపీ ప్రభంజనం ఉంది ఆ పార్టీ ప్రభుత్వం లో ఉన్న సరే టీడీపీ నిజామాబాద్ మున్సిపాలిటీ ఛైర్మెన్ స్థానం దక్కించుకోలేదు.
కాంగ్రెస్ పార్టీకే కంచుకోటగా ఉంది కార్పొరేషన్ అయ్యాక 2005 జరిగిన ఎన్నికల్లో కూడా 61 శాతం వోట్ల తో 31 స్థానాలు గెలిచింది. కానీ బిఆర్ యస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కంచుకోట బద్దలు అవుతూ వచ్చింది మొదట 16 స్థానాలకు రాగ గత ఎన్నికల్లో జస్ట్ రెండే స్థానాలకు పరిమితం అయింది.
గతంలో రెండు సార్లు మున్సిపల్ ఛైర్మెన్ స్థానం గెలిచిన బీజేపీ కూడా ఆతర్వాత పదేళ్లు కుదేలైంది.2020 నుంచి బీజేపీ ప్రభంజనం మొదలైంది.
