మహిళల విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఆయన దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు నిజామాబాద్ నగరంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,
రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.దిష్టి బొమ్మను మహిళలు చెప్పులతో కొట్టారు ఈ ఆందోళన లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ పాల్గొన్నారు .
ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాలు క్లబ్బులలో గడిపిన కేటీఆర్ కు మహిళలను గౌరవించడం తెలియదని,
మహిళల గురించి తప్పుగా మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు ఎక్కువ దూరం బస్సులో ప్రయాణించే మహిళలు వారి ప్రయాణంలో సమయాన్ని వృధా చేయకుండా దారంతో అల్లికలు చేస్తుంటే మహిళల ఆనందాన్ని చూసి తట్టుకోలేని కేటీఆర్ వ్యంగంగా మహిళలపై మాట్లాడుతూ బస్సుల్లో రికార్డింగ్ డ్యాన్సులు చేయాలని వారిపై తప్పుగా మాట్లాడారని
దానికి నిరసనగా మహిళలు ఈరోజు కేటీఆర్ కు చెప్పులతో సన్మానం చేయడం జరిగిందని ఆయన అన్నారు.
కేటీఆర్ ఎక్కువ సమయం క్లబ్బులలో ఉన్నాడని అందుకే ఆయనకు మహిళలను గౌరవించే పద్ధతి తెలియదని, ఎనిమిది నెలలుగా మహిళలు ఆనందంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని దానివల్ల కాంగ్రెస్కు మంచి పేరు వచ్చి ఎక్కడ బిఆర్ఎస్కు చెడ్డ పేరు వస్తుందో అని ఇలాంటి అనుచిత వాక్యాలు కేటీఆర్ చేస్తున్నాడని దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని మానాల మోహన్ రెడ్డి తెలిపారు.
అదేవిధంగా జిల్లాలో ఉన్న బిఆర్ఎస్ నాయకులకు, ప్రశాంత్ రెడ్డికి కేటీఆర్ మాటలు ఎందుకు వ్యతిరేకించడం లేదని కేటీఆర్ మాటల్లో తప్పు ఎందుకు కనబడడం లేదని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
వెంటనే జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ నాయకులు జిల్లా మహిళలకు క్షమాపణ చెప్పాలని అదేవిధంగా కేటీఆర్ ను మహిళ లోకానికి క్షమాపణ చెప్పమని కోరాలని మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా NSUI అధ్యక్షులు వేణు రాజ్,మాజీ మేయర్ ఆకుల సుజాత,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మఠం రేవతి,మహిళా నాయకులు గాజుల సుజాత,మలైకా బేగం,అపర్ణ,మీనా,సంగెం సాయిలు,గోవర్దన్,ప్రమోద్,సంగుభయి,విశాల్,నిఖిల్ రెడ్డి,గౌతం,ఆకుల మధు మరియు తదితరులు పాల్గొన్నారు.