ఓ వైపు అవినీతి అధికారులకు ఏసీబీ అధికారులు ఉచ్చు బిగిస్తుంటే మరో వైపు రిజిస్ట్రేషన్ అధికారులు వసూళ్ల కోసం బరితెగిస్తున్నారు. సాదారణ బదిలీల్లో భాగంగా ఇతర జిల్లా ల నుంచి రిజిస్ట్రేషన్ అధికారులు పలువురు జిల్లాకు వచ్చారు.
ఆయా ప్రాంతాల్లో సబ్ రిజిస్టార్లు విధుల్లో చేరారు. వచ్చి రాగానే సంప్రదాయ మామూళ్ల కోసం అరా తీశారు. పాత అధికారుల కు ఇచ్చే వాటాలు తాము ముట్టబోమని తమ రేటే సపరేట్ అంటున్నారు.
సదురు అధికారులు ఇదేదో లోపాయికారి ఇచ్చిన ఆదేశాలు కావు నేరుగా డ్యాకుమెంట్ రైటర్ల తో సమావేశం అయ్యారు.
వారికి ఓపెన్ గానే ధమ్కీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.తమ రూట్ సపరేట్ రేట్ సపరేట్ అంటూ తెగేసి చెప్పారు.
మొదట ఇప్పటి దాక ఏఏ పని కి ఎంత మొత్తం ఇస్తున్నారనేది వాకబు చేసారు. ఎహే ఇక నుంచి ఆ రేట్లు మాకు ఆమోద యోగ్యం కాదని తెగేసి చెప్పేసారు. ఏ ఏ పని కి ఎంత ఇవ్వాలనేది స్పష్టంగా చెప్పేసారు.
వారు చెప్పిన వాటాలచిట్టా తో డ్యాకుమెంట్ రైటర్లు నోళ్లు వెళ్ళబెట్టారు. ఎలాంటి లింక్ ధృవ పత్రాలు లేకుండా కేవలం మున్సిపల్ అధికారులు ఇచ్చే హౌస్ నెంబర్ ను ఆధారంగా చేసుకొని రిజిస్ట్రేషన్ లు చేస్తారు.
నిజానికి ఇది నిబంధనలకు విరుద్ధం అయినా ఇదివరకు ఇలాంటి రిజిస్ట్రేషన్ లు జరిగేవి అందుకు గాను అధికారులకు రెండు వేల రూపాయలు ముట్టజెప్పేవారు. కానీ ఇకపై ఒక్కో డ్యాకుమెంట్ రూ 5000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు.
అలాగే ఆస్తి యజమాని చనిపోతే డెత్ సర్టిఫికెట్ తో పాటు తహశీల్ధార్ నుంచి జారీ అయ్యే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను ఆధారంగా నే అస్తి బదలాయింపు జరగాలి కానీ కేవలం నోటరీ ద్వారా ఈ తరహా రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు కు ఇక్కడి అధికారులు గతంలోనే తెరలేపారు.
అది తదుపరి కొసాగించడానికి ఐదువేల రూపాయలు ఇవ్వాలని కొత్తగా కొలువులోకి వచ్చిన అధికారులు స్పష్టం చేశారు.
జిల్లాలో ఏసీబీ అధికారులు వరుస దాడులతో బెంబేలేత్తిస్తున్న నేపథ్యంలోనిరంతరం నిఘా వుండే రిజిస్ట్రేషన్ కార్యాలయం లో అధికారులు బాహాటంగా మామూళ్ల కోసం బరితెగించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది