HomeCRIMEసీపీ సీరియస్ ….రౌడీ మూకల ఫై ఉక్కుపాదం …….రియాజ్ వేటలో పది బృందాలు ……..సమద్ టీం...

సీపీ సీరియస్ ….రౌడీ మూకల ఫై ఉక్కుపాదం …….రియాజ్ వేటలో పది బృందాలు ……..సమద్ టీం కోసం గాలింపు ? ……..

కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య కమిషనర్ సాయి చైతన్య చలించి పోయారు. ఈ ఘాతుకానికి పాల్పడిన రియాజ్ ఆచూకి కోసం వేట మొదలు పెట్టారు. ఇందుకోసం అర్ద రాత్రి నుంచే పది బృందాలను రంగంలోకి దించారు.

దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లాంటి కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్ అరబ్ ఎక్కువగా అజ్ఞాతం లో వుంటాడు అర్ద రాత్రి అయ్యాకే కార్యకలాపాలు సాగిస్తాడు. అతని కదలికలమీద సీసీఎస్ నిరంతరం నిఘా వేసి వుంటూ వస్తుంది.బైకు దొంగతనాలు కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న రియాజ్ ను కొద్దీ రోజుల క్రితం సరెండర్ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ చోట నేత సంప్రదింపులు జరిపారని సమాచారం.

రియాజ్ గతంలో మరో నేరస్తుడు సమద్ తో కల్సి పనిచేసేవాడనేది పోలీసు లకు సమాచారం. అందుకే సమద్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తుంది. కోటగిరి వర్ని ప్రాంతాలకు మకాం మార్చిన సమద్ కు రియాజ్ తో సంబంధాలు ఉన్నాయా లేదా అనేది స్పష్టత రావడం లేదు.

కేవలం వాట్సప్ ను మాత్రమే వాడే రియాజ్ హత్య జరిగిన తర్వాత ఎవరెవరికి కాల్ చేసింది నిర్దారించడం క్లిష్టంగా మారింది.ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైన అధిగమించి రియాజ్ ను పట్టుకోవాలనేది పోలీసుల పట్టుదల గా ఉంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments