బ్యాంకు ఖాతా అప్ డేట్ చెయ్యాలంటూ సైబర్ నేరగాళ్ల ఓ రైతు కు టోకరా ఇచ్చారు గురువారం నందిపేట మండల కేంద్ర రాంనగర్ కాలనీకి చెందిన బోడ రాజు అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో నుండి సైబర్ నేరగాళ్లు 6000 రూపాయలను అప్పనంగా కాజేశారు.
వాట్సాప్ ద్వారా ఎస్బిఐ యోనో యాప్ పేరిట కేవైసీ ని అప్డేట్ చేసుకోమని మెసేజ్ రావడంతో పొరపాటున రాజు కేవైసీ అప్డేట్ కొరకు ఆ లింకు పై నొక్కాడు.
వెంట వెంటనే ఆప్ డౌన్లోడ్ అవడం, అంతలోనే వాట్సాప్ హ్యాక్ అవడం, అకౌంట్లో నుండి డబ్బులు ఖాళీ అయినట్టు మెసేజ్ రావడం చకచకా జరిగిపోయాయి. వాట్సాప్ హ్యాక్ కావడాన్ని గమనించిన రాజు తన అకౌంట్ చూసేసరికి అకౌంట్లో నుండి 6 వేల రూపాయలు కట్ అయిపోయాయి.
రాజు వెంటనే మిగతా గ్రూపుల అందరికీ నా వాట్సాప్ హ్యాక్ అయిందని, నా పేరిట వచ్చిన బ్యాంకు లింకును ఎవరు ఓపెన్ చేయవద్దని, సమాచారం ఇచ్చారు.
అర్ధగంట వ్యవదిలోనే ఇంకా ఇద్దరు ముగ్గురు బాధితులు కూడా గురయ్యారని, వెంటనే పోలీసులను సంప్రదించి కేసు పెట్టడం జరిగిందని తెలిపారు. ఎవరు కూడా బ్యాంకుకు సంబంధించిన లింకులను ఓపెన్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
