అధికార పార్టీకి మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఝలక్ ఇవ్వబోతున్నారా ? పార్టీ పెద్దలు తనను పట్టించుకోక పోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి తో ఉన్నారా ? అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.
పార్టీ కోసం ఎంత కష్టపడినా తగిన గుర్తింపు లభించడం లేదన్న ఆవేదనతో సంజయ్ ఉన్నారు ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత క్రియ శీలకంగా పనిచేసిన తనకు ఎన్నికల తర్వాత అగ్ర నేతలు టచ్ లోకి రాకపోవడం ఆయన కినుక వహించారని సమాచారం తనకు ప్రాధాన్యత ఇవ్వచోట ఎలా కొనసాగాలని సంజయ్ తర్జన భర్జనలు పడుతున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు తదుపరి రాజకీయ అడుగులు ఎటు వైపు వెయ్యాలనే విషయంలో ముఖ్య నేతల తో ఆయన సమాలోచనలు చేస్తున్నారు .
పార్టీలో చాలా కాలంగా యాక్టివ్‌గా ఉంటున్నా, సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. . తన అనుచరులు, కార్యకర్తలు పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా ఆలోచనకు వచ్చారని సమాచారం
