ఎడపల్లి మండలం ఠానాకాలన్లో గురువారం తెల్లవారుజామున దొంగలు ఐదు ఆలయాల్లో చోరీలకు పాల్పడి హల్చల్ చేసింది.
గుళ్లల్లోకి ప్రవేశించి బంగారం అపహరించడంతోపాటు, మూడు ఆలయాల్లో హుండీలను ధ్వంసం చేశారు.
వరుస దొంగతనాలతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
