కుల గణనను ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రభుత్వం ఈ పక్రియ ను ఈ నెలాఖరులోగా పూర్తీ చేసి వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. ఈ మేరకు యంత్రాంగం శరవేగంగానే ఏర్పాట్లు చేస్తుంది. కుల గణన పక్కాగా జరుపుతున్న ప్రభుత్వం ఆ సర్వే నివేదిక ఆధారంగానే రిజర్వేషన్ లను అమలు చేసే లా కార్యాచరణ సిద్ధం అవుతుంది.
ఎలాగో ప్రభుత్వం ఏర్పాటు అయి వచ్చే నెలతో ఏడాది పూర్తీ అవుతుంది కిందిస్థాయి క్యాడర్ లో నెలకొన్న నిరాశ నిస్పృహ లను
అధిగమించడానికి పంచాయితీ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం అనివార్యంగా భావిస్తున్న రేవంత్ పంచాయితీ ఎన్నికలనే మొదట పూర్తీ చేయాలనే ఆలోచనలో ఉంది.ఇలాంటి సంకేతాల నేపథ్యంలోనే అధికారులు సైతం ఏర్పాట్లు వేగిరం చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం అధికారులను ఇదే కార్యంలో నిమగ్నం అయ్యేలా పురమాయిస్తుంది.జిల్లాలో 545 గ్రామ పంచాయితీ లుంటే 5022 వార్డు లున్నాయి. 8 .35 లక్షల ఓటర్లు ఉన్నారు. కులగణనపక్రియ పూర్తీ అయ్యాకే రిజర్వేషన్ పక్రియ మొదలు పెట్ట బోతున్నారు.
అర్హులు ఎవరో తెలుసా ?
సర్పంచ్/వార్డు సభ్యుల పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి అనర్హులు.
జూన్ 1, 1995 తర్వాత మూడో సంతానం ఉండకూడదు.
ఒక కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే అర్హత.
ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే, రెండో భార్యకు ఒకరు లేదా ఇద్దరు సంతానం కలిగితే భర్తకు పోటీ చేసే అర్హత
రెండో భార్యకు మాత్రం పోటీ చేసే అర్హత ఉంటుంది.
