రుద్రూర్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి రెచ్చిపోయారు. వైన్స్ కిరాణా షాప్ ల్లో చొరబడి దోచుకున్నారు . టానిక్ లిక్కర్ మార్ట్ వైన్స్ కు వెనుక భాగంలో ఉన్న రేకులు కత్తిరించి వైన్స్ లోకి చొరబడి సుమారు 60 వేల రూపాయల నగదుతో పాటు లిక్కర్ బాటిళ్ళ ను ఎత్తుకెళ్లారు వైన్స్ లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. హార్డ్ డిస్క్ నీ ఎత్తుకెళ్లారు. అలాగే మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందున్న రెండు కిరణ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. కిరాణా దుకాణం వెనుక భాగంలో గోడను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించి సుమారు 5000 రూపాయల నగదు తో పాటు షాప్ లో ఉన్న సామాన్లను దొంగలించినట్లు దుకాణ యజమానులుపోలీసులకు ఇచ్చిన పిర్యాదు ల్లో పేర్కొన్నారు పేర్కొన్నారు. క్లూస్ టీం రంగంలోకి ఆధారాలు సేకరించే పనిలో ఉంది
