విదేశీ ప్రయాణం కోసం విమానాశ్రయానికి వెళ్తున్న వ్యక్తి.. మార్గమధ్యలో టీ తాగేందుకు ఆగి ప్రాణాలు కోల్పోయాడు. హోటల్ వద్ద నిల్చున్న అతడిని ప్రైవేటు బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శంషాబాద్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన అజ్మల్ దుబాయ్ వెళ్లేందుకు విమానాశ్రయానికి బయలుదేరాడు.
మార్గమధ్యలో టీ తాగేందుకు ఓ హోటల్ వద్ద ఆగాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సెవెన్ హిల్స్ రోడ్‌వేస్‌కు చెందిన బస్సు అజ్మల్‌ను ఢీకొట్టింది.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అజ్మల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని కరీంనగర్ వాసి అజ్మల్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
