HomePOLITICAL NEWSUncategorizedమహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక టీపీసీసీ చీఫ్ ప్రత్యేక పూజలు...

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక టీపీసీసీ చీఫ్ ప్రత్యేక పూజలు…

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా శ్రీ మచిలేశ్వర వీర భద్రాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు.

ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సంక్షేమం, శాంతి, సౌభ్రాతృత్వం కోసం మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రార్థనలు చేశారు. మహా శివరాత్రి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆధ్యాత్మిక శక్తిని నింపాలని, సమాజంలో ఐక్యతను పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పరమశివుని ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజల జీవితాల్లో ఆనందం, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.

తెలంగాణ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.పూజా కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments