నిజామాబాద్ నగరం లోని ఎల్లమ్మగుట్ట వద్ద ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా తీసుకెళుతున్న ఏడు లక్షల ఏడు వేల రూపాయలనగదు ను పోలీసులు పట్టుకున్నారు.మోర దీపక్ అను వ్యక్తి వద్ద నుండి ఈ నగదు స్వాదినపరుచుకున్నారు.
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఎవరూ కూడా అక్రమంగా డబ్బులను తరలించకూడదని ఈ సందర్భంగా పట్టణ సిఐ నరహరి కోరారు . ఈ స్వాధీన పరచుకున్న 7 లక్షల ఏడు వేల రూపాయలను నిజామాబాద్ ట్రెజరీ యందు డిపాజిట్ చేసి గ్రీవెన్స్ కమిటీకి సమాచారం అందించినట్టు పట్టణ సీఐ నరహరి తెలిపారు