HomeCRIMEట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్టు.. 19 కేసుల ఛేదన.. నిందితుల నుంచి 74 కేజీల రాగి...

ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్టు.. 19 కేసుల ఛేదన.. నిందితుల నుంచి 74 కేజీల రాగి తీగ స్వాధీనం

జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని రాగి కాయిల్స్‌ను దొంగిలిస్తున్న ముఠాను వేల్పూర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆరుగురు దొంగలతో పాటు, దొంగ సొత్తును కొనుగోలు చేస్తున్న స్క్రాప్ వ్యాపారిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య వెల్లడించారు.

ఆర్మూర్ పరిధిలోని పోచమ్మగల్లికి చెందిన కర్రే వినోద్ కుమార్, అండ్రాసి నవీన్, గుంజోల్ల ఈశ్వర్, బాజ హరిప్రసాద్, కర్రే విజయ్ కుమార్, మూల దుర్గాప్రసాద్ రెడ్డి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పూనుకున్నారు.

వీరికి ఆర్మూర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ వసీం అలియాస్ ‘తిల్లి బాబా’ తో పరిచయం ఏర్పడింది. పాత ఇనుప సామాగ్రి కొనుగోలు చేసే నెపంతో పగలు గ్రామాల్లో తిరుగుతూ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి, రాత్రి వేళల్లో వాటిలోని రాగి కాయిల్స్‌ను చోరీ చేసేలా తిల్లి బాబా వీరికి సూచనలు ఇచ్చేవాడు.

ఈ ముఠా వేల్పూర్, బాల్కొండ, మెండోర, భీంగల్, ఆర్మూర్, యెర్గట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 19 ట్రాన్స్‌ఫార్మర్ చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం పడగల్ గ్రామ శివారులోని రైల్వే బ్రిడ్జ్ వద్ద నిందితులు ఉండగా పోలీసులు పట్టుకున్నారు.

వారి వద్ద నుంచి 74 కిలోల రాగి తీగ, ఒక ఆటో, మూడు ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్లు మరియు దొంగతనానికి ఉపయోగించిన పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఆర్మూర్ రూరల్ సీఐ జి.జాన్ రెడ్డి, వేల్పూర్ ఎస్ఐ బి.సంజీవ్, బాల్కొండ ఎస్ఐ కె.శైలెందర్, సిబ్బంది భారత్ గౌడ్, నరేంధర్, హరీష్, సాయి కిరణ్, శ్రావణ్, సుదర్శన్‌లను సీపీ అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments