నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ యువకుడు గురువారం రాత్రి అదృశ్యమయ్యాడు.ఒకటవ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
గన్నారం గ్రామానికి చెందిన నారాయణ మతిస్థిమితం లేని తన కుమారుడు గణేష్ ను తీసుకుని గురువారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. గురువారం రాత్రి తన కుమారుడిని పట్టుకొని ఆసుపత్రిలో పడుకున్నాడు.
శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి తన కుమారుడు. కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ఆచూకీ కోసం గాలించినా లభ్యం కావాలకపోవడంతో ఆందోళన చెందాడు.
దీంతో ఒకటవ టౌన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి బాలుని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ విజయ్ బాబు తెలిపారు.
