గురుకులాల్లో రూ. రెండు వేల కోట్ల అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆర్ఎస్ ప్రవీణ్ లు చేసిన ఆరోపణలు రాజకీయ సవాళ్లకు దారి తీశాయి.
ఇందులో అవినీతి ఫై చర్చించడానికి చర్చ కు రావాలని సంక్షేమ శాఖల మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ అజహారోద్దిన్ లు గురువారం గన్ పార్క్ దగ్గర బైఠాయించారు.భారీ ఎత్తున పోలీసులు బలగాలు సైతం మోహరించాయి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
గురుకులాల మొత్తం టెండర్లు కూడా రూ . రెండు వేల కోట్లు కూడా కావని అన్నారు. టెండర్ వచ్చిన కాంట్రాక్టర్ మాకేమైనా చుట్టమా అని ప్రశ్నించారు. కోన్ కిస్కా గొట్టం గాడు అడిగితే మేము జవాబు చెప్పమని అన్నారు దీనిపై తాడోపేడో తేల్చుకుంటామని బిఆర్ యస్ నేతలకు దమ్ముంటే రావాలని మంత్రులు సవాల్ చేసారు దీనితో మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు .
//////గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై చర్చించేందుకు హరీష్ రావు గన్ పార్క్ వద్దకు రావాలని మంత్రి అడ్లూరి చేసిన చాలెంజ్ ను ఆయన స్వీకరించారు. మొదట కేటీఆర్ తో కల్సి తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయన అక్కడి నుంచి గన్ పార్కుకు బయల్దేరగా.. కానీ అప్పటికే తెలంగాణ భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు అక్కడే హరీష్ రావు వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చర్చకు రమ్మనడం, పోలీసులను అడ్డం పెట్టుకుని పారిపోవడం దేనికంటూ హరీష్ రావు మంత్రులపై ఫైరయ్యారు. చర్చకు రావాలని ముగ్గురు మంత్రులు పిలిస్తే వెళ్తున్నానని, దానికెందుకు తనను ఆపుతున్నారని పోలీసులతో వాదించారు. కావాలంటే మంత్రులకు ఫోన్ చేసి అడగాలని, వారంతా తమకోసం అమరవీరుల స్థూపం వద్ద ఎదురుచూస్తున్నారన్నారు.
తప్పు చేయకపోతే ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. తామేం కొట్లాటకు పోవట్లేదని, దయచేసి తమను ఆపొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల పక్షాన, దళితుల పక్షాన, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రజల గొంతుకగా వెళ్తున్నానన్నారు.
తమ వద్ద కొండాసురేఖ లెటర్, హైకోర్టు ఆర్డర్లు, డ్రగ్స్ సప్లయర్లకు, బ్రోకర్లకు టెండర్లు ఇచ్చిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. కాగా.. ఇందుకు అనుమతి లేకపోవడంతో గన్ పార్కుకు వెళ్లేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లనివ్వబోమన్నారు. వాహనాలను వెళ్లనివ్వకపోతే కాలినడకన వెళ్తామన్నారు. కారు దిగి వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు , బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగి హరీష్ రావు కిందపడిపోయారు. తమ నేతనే అడ్డుకుంటారా అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులపై ఫైరయ్యారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ హరీష్ రావును, బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
/// ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినా ఒక్కరు కూడా ఫోన్ ఎత్తడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao)ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు రావాలని సవాల్ చేసి కాంగ్రెస్ నాయకులు పారిపోతున్నారని విమర్శిం చారు.
గన్‌పార్క్ రమ్మన్నారు. వారు చెప్పినట్లే వస్తుంటే పోలీసులతో అడ్డుకున్నారు. గన్‌పార్క్ వస్తే అన్ని ఆధారాలు చూపిస్తానని స్పష్ట చేశారు. ఒకసారి గన్‌పార్క్, మరోసారి తెలంగాణ భవన్ అంటూ కాంగ్రెస్ తోక ముడిచిందని ఎద్దేవా చేశారు.
