టెర్రరిస్ట్ లకు కాంగ్రెస్ పార్టీ మాతృసంస్థగా మారిందని,స్టుడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా కూటమి సంస్థ ముస్లీంలు అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేసి పంపారనీ ఎంపి అరవింద్ మండిపడ్డారు.
బుదవారం నిజామాబాదు నగరంలో జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాల్గొని ఎంపీ అరవింద్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశం మొత్తం టెర్రరిస్ట్ లకు మాతృసంస్థగా మారుతుందని అన్నారు.ఈ సంస్థ ను 2001లో రద్దు చేసింది దీన్ని 2029 వరకు మోడీ ప్రభుత్వం పొడిగించింది.
ఈ సంస్థకు ఐఎస్ఐ సంస్థలతో పొత్తు ఉందనీ అన్నారు.దేశంలో జరిగే ఎన్నికలు మాకు రాజకీయ నాయకులకు మధ్యనా? లేక మాకు టెర్రరిస్టులకు మధ్యన ఆయన ప్రశ్నించారు ఇదివరకే జగిత్యాల పిఎఫ్ఐ అడ్డా అని, బోధన్ రోహింగ్యాలకు,దొంగ పాస్ పోర్ట్ లకు అడ్డాగా మారాయని అన్నారు.
దేశంలోని ఇస్లామిక్ సంస్థలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశంలోని హిందూ ప్రజలందరూ ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు అన్ని కూడా ఇస్లాం రిజర్వేషన్లు కల్పిస్తారని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ అన్ని విధాలుగా బలంగా ఉండేదని ఇప్పుడు అన్ని విధాలుగా కోల్పోయింది అంటూ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్లామిక్ సంస్థలన్నీ బలపడతాయి దీని గురించి హిందువులందరూ ఆలోచించాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి , న్యాలం రాజు, మాస్టర్ శంకర్,స్రవంతి తదితరులు పాల్గొన్నారు
