చికిత్స పొందుతూ గుర్తుతెలియని వృద్ధురాలి మృతి చెందారు. ఈ ఘటన నగరంలోని ఒకటవ టౌన్ లో చోటు చేసుకుంది. సీఐ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని ముస్కాన్ కలెక్షన్స్ ముందు శంభునిగుడి దగ్గర ఒక గుర్తు వృద్ధురాలు వయస్సు అందజ వయసు 55 నుంచి 60 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు.
వృద్ధురాలు అపస్మారక స్థితిలో ఉన్నందున 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈమె వాలకం బట్టి బిక్షాటన చేసుకునే వ్వక్తి గ కనపడుతున్నది, మృతురాలి వివరాలు ఎవరికైనా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ ఫోన్ నెంబర్ 8712659714 ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ రఘుపతి పేర్కొన్నారు.
