Friday, November 14, 2025
HomePOLITICAL NEWSకాషాయ శిబిరం లో పసుపు సంబరం ……..ఎన్నికల వేల అనుహ్యంగా పెరుగుతున్న ధర ………తానే బ్రాండ్...

కాషాయ శిబిరం లో పసుపు సంబరం ……..ఎన్నికల వేల అనుహ్యంగా పెరుగుతున్న ధర ………తానే బ్రాండ్ అంబాసి డర్ అంటున్న అర్వింద్ .

పసుపు బోర్డు అంశం ను తెరమీదకి తెచ్చి లోకసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ ను ఇరుకున పెట్టాలనే ప్రత్యర్థుల వ్యూహం బెడిసి కొట్టేలా ఉంది. ఇప్పుడు అదే పసుపు అర్వింద్ కు అస్రంగా మారుతుంది. లోకసభ ఎన్నికల ముంగిట జిల్లాలో పసుపు అంచనాలకు అందనంత ధర పలుకుతుంది. మొన్నటి దాక పసుపే ఈసారి ఎన్నికల్లో శరాఘాతం అవుతుంది బెంబేలెత్తిన కాషాయ శ్రేణులు ఇప్పుడు పసుపు సంబరాలు చేస్తున్నారు . పసుపు ధర దశాబ్దాల రికార్డు లను తిరగరాస్తుంది.

మొదటి నుంచి పసుపు కు తానే బ్రాండ్ అంబాసిడర్ అవుతానంటూ ఎంపీ అర్వింద్ చెప్పి నట్లే క్వింటాల్ ధర ఇదే సీజన్ లో 20 వేల రూపాయలకు చేరుతుందని ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆయన కల సాకారం అయ్యేలా పసువు ధర శరవేగంగా పెరుగుతుంది. ఈ సీజన్ 12 వేల రూపాయలతో కొనుగోళ్లు మొదలయ్యాయి. సోమవారం పెర్కిట్ రైతు తీగల కృష్ణారెడ్డి కి చెందిన పసుపు నిజామాబాద్ మార్కెట్ యార్డు లో క్వింటాల్ ధర రూ : 18 299 ధర పలికింది. నిజానికి క్వింటాల్ పసుపు రూ 16203 ధర 2011 లో పలికింది. అదే పసుపు చరిత్ర లో రికార్డ్ ధర . కానీ ఈసారి సీజన్ లో ఆ రికార్డు లన్ని తెరమరుగు అయ్యాయి. సీజన్ మొదలు పసుపు ధర స్థిరంగా పెరుగుతూనే వుంది.

పసుపు ధర పెరగడం యాదృచ్ఛికమేమి కాదు. మోడీ అనుసరించిన వ్యూహమే. ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గించడం స్పైస్ బోర్డు మార్కెటింగ్ ఎత్తుగడలు అనుసరించడం వంటి కారణాలతో పసుపు ధర లో అనూహ్య పెరుగుదల వచ్చిందని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.నిజానికి జిల్లాలో పండే పసుపు కు అనేక దేశాల్లో డిమాండ్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ గడ్డ మీదే ప్రధాని పసుపు బోర్డు ప్రకటించి దశాబ్దాల రైతుల కల ను సాకారం చేసారు. పసుపు బోర్డు హామీతో అర్వింద్ గత ఎన్నికలో విస్తృతంగా ప్రచారం చేసారు.

బిఆర్ యస్ కాంగ్రెస్ నేతలు అర్వింద్ ను పసుపు బోర్డు అంశం లోనే టార్గెట్ చేస్తూ వచ్చారు. కానీ బోర్డు ఏర్పాటు కు మోడీ సర్కార్ పచ్చ జెండా ఊపేసింది.దీనితో అర్వింద్ ను రాజకీయంగా దుమ్మెత్తిపోయడానికి అస్రం లేకుండా పోయింది.మోడీ మానియా అయోధ్య అంశాలనేపథ్యంలో అర్వింద్ కు పసుపు బోర్డు సైతం సానుకూలం అయింది. మరోసారి టికెట్ ఖరారు కావడంతో అయన ఎన్నికల ప్రచార భేరి మోగించారు క్షేత్ర స్థాయిలో విసృతంగా తిరుగుతున్నారు.

ప్రధాన రాజకీయ పార్టీల్లో లోకసభ ఎన్నికల సన్నాహాల సందడి ఉన్నా ఇంకా అభ్యర్థుల కసరతుల్లోనే ఉన్నాయి. కానీ ఎన్నికల హిట్ మొదలవుతున్న తరుణంలో పసుపు ధర రికార్డు ల మోత మోగిస్తుంది. పసుపు రైతుల సంబరం అంతాఇంతా కాదు. నిజామాబాద్ లోకసభ పరిధి లో బాల్కొండ ఆర్మూర్ జగిత్యాల్ కోరుట్ల నియోజకవర్గాల్లో లక్ష మంది పసుపు సాగు చేసే రైతులున్నారు.

యేటా పసుపు ధర లో పెరుగుదల లేక పోవడంతో క్రమేణ సాగు విస్తీర్ణం తగ్గుతుంది. కానీ స్పైస్ బోర్డు క్రియాశీలకం కావడంతో ఈసారి సాగు అనూహ్యంగా పెరిగింది. అందుకు తగ్గట్టుగా ధర కూడా అంచనాలకు మించి పలుకుతుంది. ఇంకేముంది రైతులే కాదు కాషాయ శ్రేణుల్లో పట్టరాని సంతోషం కనిపిస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!