- పలుచోట్ల నేలకొరిగిన వరి పంట
- కల్లాలలో తడిసి ముద్దయినవారి ధాన్యం
- లబో దీబోమంటున్న రైతులు
నిజామాబాద్ జిల్లాలో గత మూడు రోజులుగా మెగావృతమై అక్కడక్కడ వడగండ్ల కురియడంతో రైతుల గుండెల్లో గుబులు పుడుతుంది. ప్రకృతి విపత్తులు రైతులపై పగబడుతున్నాయి. వరి రైతులపై అకాల వర్షాలు విరుచుకుపడుతున్నాయి.జిల్లాలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న అకాల వర్షం వర్షాల కారణంగా రైతులు అరుంగాలం కష్టించి పండించిన వరి పంట తడిసి ముద్దయింది.
ఈదురు గాలులతో కూడిన వర్షం గత రాత్రి బీభత్సం సృష్టించగా రైతులు కళ్ళలలో ఆరబోసిన ధాన్యాన్ని రక్షించుకునేందుకు తిప్పలు పడుతున్నారు. పండించిన పంట చేతికందే సమయంలో నష్టం వాటిల్లడంతో రైతులు దిగులు పడుతున్నారు. కురిసిన అకాల వర్షం వర్షం రైతులకంట కన్నీరు పెట్టిస్తోంది. పంట చేతికందే సమయంలో వర్షం కురియడంతో జిల్లాలోని పలు మండలాల్లో వరిపంట నేల వాలింది.
తమ ధాన్యాన్ని రక్షించుకునేందుకు కుప్పలుగా పోసి పైన తర్పెండ్లు కప్పుకున్నారు. జిల్లాలో పెద్ద మొత్తంలో వరి పంటను రైతులు సాగు చేశారు. ఇప్పటికే 60 శాతానికి పైగా వరి పంట కోత జరిగిపోయింది. ఇంకా మిగిలి ఉన్న 40 శాతం రైతుల కోయాల్సి ఉంది. ఓవైపు గిట్టుబాటు ధర లేకపోవడం మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో రైతులు దిగులు పడుతున్నారు.












