కష్టపడి కొనుక్కున్న ప్లాటును కబ్జా చేయాలని చూస్తున్నా బీఆర్ఎస్ నాయకుడి పై చర్యలు తీసుకోవాలని కోటగిరి సంతోష్, ఉమారాణి అన్నారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా కోటగిరి సంతోష్, ఉమారాణి మాట్లాడుతూ.. మోపాల్ మండలం కంజర గ్రామానికి చెందిన మేము మా గ్రామంలో 2023 లో 106.66 చ.గజాల స్థలాన్ని దాసరి అంకిత వద్ద కొనుగోలు చేశామని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, కొనుగోలు చేసిన సంవత్సరం తరువాత మా స్థలాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశంతో మా పై దాడి చేస్తూ, చంపుతామని తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తూ మా భార్య, భర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పిల్లి భూమారావు, పిల్లి గంగారాం, సాపల లక్ష్మణ్ లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగిందని, అక్కడ ఎస్ ఐ బయట మాట్లాడుకోవాలని సూచించారని, కొంతమంది గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు అదరంగి భూమయ్య, బున్నే రవి, బున్నే భాస్కర్, రాజారాం రవీందర్, ఆరికెల జగతి, బోయిని సత్య నారాయణ కొంతమంది మహిళలు వారికి సపోర్ట్ గా నిలుస్తున్నారని అన్నారు.
కొందరు మహిళలు అక్రమంగా మా స్థలంలోకి ప్రవేశించి మా యొక్క పనులను అడ్డుకుంటున్నారని అన్నారు మేము ఈ స్థలమును కొనుగోలు చేశామని మాకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని, మీ వద్ద ఏమైనా ఉంటే తీసుకురావాలని చెప్పినప్పటికీ లేదు మేము ఈ స్థలాన్ని కబ్జా చేశాం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారని అన్నారు.
మా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయని చూపిస్తే వాటిని చింపివేసి బూతు మాటలతో నీవు నీ పెళ్ళాం, నీవు ఇక్కడి నుంచి వెళ్లకుంటే చంపి ఇదే స్థానంలో పాతి పెడతామని అసభ్య పదజాలంతో ఒక మహిళను చూడకుండా నా భార్యను, నన్ను బూతు మాటలతో తిడుతున్నారని అన్నారు. గ్రామంలో చిన్న కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నమని పిల్లల భవిష్యత్తు కోసం గ్రామంలో ప్లాట్ కొనుగోలు చేయడం జరిగిందని, మా ప్లాట్ స్థలంలో మొరం వేయిద్దామని వెళితే చాపలక్ష్మి ఇంకా కొంతమంది మహిళలు వచ్చి మా మీద దాడి చేశారని అన్నారు.
మా మోరం పక్కకు జరిపి, కర్రలతో మీ అంతు చూస్తామని దాడికి దిగినారని అన్నారు. దాడి చేస్తున్న సమయంలో నా సెల్ ఫోన్ ద్వారా వీడియో రికార్డింగ్ చేశానని, అక్కడ ఉన్న గ్రామాలకు కంటికి చెందిన అదరంగి భూమయ్య మరి కొంతమంది గ్రామ అభివృద్ధి సభ్యులు మా మాట వినకుంటే మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. మాకు రక్షణ లేదని వీరందరి నుంచి మమ్మల్ని రక్షించి, కబ్జా చేయాలని చూస్తున్న వారిపై, సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.