జిల్లాలో హోళీ సంబరాలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి కామదహనాలు జరిపి మరుసటి రోజు సోమవారం హోళీ నిర్వహించనున్నారు.హోళీ పండగ నాడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండ పోలీసులు కట్టుదిట్ట మైన చర్యలు చెప్పట్టారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయనున్నారు. సోమవారం 2024, మార్చి25న హోలీ సందర్భంగా నగర వ్యాప్తంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. నగరంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా మద్యం షాపులు బంద్ చేయాలని నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు.
సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 26 మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ చేయలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా పండుగ సందర్భంగా షాపులు మూసివేయాలని వైన్స్నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలను సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదన్నారు. వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు.ఆంక్షలు ఉల్లఘించే వారిమీద చర్యలు తప్పవన్నారు