Friday, November 14, 2025
HomePOLITICAL NEWSనిజామాబాద్ పట్టణంలోని ధర్మపురి కాలనీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి...

నిజామాబాద్ పట్టణంలోని ధర్మపురి కాలనీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ గారు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

నిజామాబాద్ పట్టణంలోని ధర్మపురి కాలనీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ గారు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ

పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన నేపథ్యంలో నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్టార్‌ విందులో పాల్గొన్న ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు.

మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ గారు మాట్లాడుతూ

ముస్లింల రిజర్వేషన్స్ తొలగించడం మోదీ తరం కాదు

తమ ప్రభుత్వం ముస్లింలకు అమలు చేస్తోన్న నాలుగు శాతం రిజర్వేషన్‌ను తొలగిస్తానంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా చెప్పారని, అది ఆయన వల్ల కాదని అన్నారు. ముస్లింల రిజర్వేషన్‌ను తొలగించడం ప్రధాని మోదీ వల్ల గానీ, అమిత్ షా వల్ల గానీ కాదని స్పష్టం చేశారు.

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పోరాడామని దాన్ని కాపాడే బాధ్యత కూడా తమదేనని అన్నారు. తమది సెక్యులర్ ప్రభుత్వమని, అందరినీ కలుపుకొని వెళ్తుందని వ్యాఖ్యానించారు. మతం పేరుతో విడగొట్టబోమని చెప్పారు.

హిందువులు, ముస్లింలు తనకు రెండు కళ్లలాంటి వారని అన్నారు

రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా, దేశంలోనే అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు

ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్బిన్ హాందాన్ కేశ వేణు
నరాల రత్నాకర్. హారున్. ఖుద్దుస్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!