ఆదిలాబాద్ జిల్లా..మహారాష్ట్ర సరిహద్దుల్లో మంగళవారం తెల్లవారు జామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాపరిధి ఈ ఘటన జరిగింది ,ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లోని రేపన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు .
మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత, డీవీసీ సభ్యుడు వర్గీష్ ప్లాటూన్ సభ్యులు మంగాతు, కురుసం రాజు, వెంకటేష్ ఉన్నారు.వీరిపై రివార్డు కూడా ఉంది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ తో ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
